రవితేజ కొత్త చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' నుండి తాజాగా గాయత్రీ భరద్వాజ్ లుక్ విడుదలైంది. వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినిమాలో 'మణి' పాత్రలో నటిస్తున్న గాయత్రి భరద్వాజ్ కొత్త లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. దీనితో పాటు ఈ మూవీ నుంచి ధర్డ్ సింగిల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, అనుకీర్తి వ్యాస్ జయవాణి పాత్రలో, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.










