May 27,2023 11:06

పాండవగల్లు (కర్నూలు) : పాండవగల్లు పెద్ద చెరువును ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ... సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలో సిపిఎం శాఖ కార్యదర్శులు కె.పాండురంగ, గోవిందు, సిపిఎం సభ్యులు భీమాంజనేయులు, రమేష్‌, పార్టీ నాయకులు టి.గోవిందరెడ్డి, పకీరయ్య, హుసేని, హనుమయ్య, ఆంజనేయ, మల్లికార్జున, కొండయ్య కూర్చున్నారు.