Dec 27,2022 14:54

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లా వేంకటగిరి పట్టణములో సంచలనం సష్టించిన నగల దుకాణంలో చోరి కేసును పోలీసులు ఛేదించి చోరికి గురైన సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి పరమేశ్వర రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు అలవాటుపడి దొంగతనాలకు అలవాటు పడిన యువకుడు ఈ చోరి చేసినట్లు తెలిపారు. సుమారు 637.135 గ్రాముల బంగారు నగలు, 4.982 కేజీల వెండి వస్తువులు మరియు రూ.13,000 నగదు స్వాధీనము చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిని చాకచక్యంగా పట్టుకోవడంలో కషి చేసిన వేంకటగిరి సిఐ రామకృష్ణ, గూడూరు రూరల్‌ సిఐ జి.దశరధ రామారావు, గూడూరు పట్టణ సిఐ హజరత్‌ బాబు, వేంకటగిరి ఎస్‌ఐ జీలాని బాషను, ఐడి పార్టి సిబ్బంది రాజు, వెంకటేశ్వర్లు, జీలాని, విష్ణు, శివ కుమార్‌ , శివనారాయణ, సాయికష్ణలను అభినందించి రివార్డులు ప్రకటించారు.