Nov 08,2023 15:20

ఆత్మకూరు : ప్రజా,రైతు,కార్మిక సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌ పేర్కొన్నారు. ప్రజారక్షణ బేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన స్కూటర్‌ యాత్ర ఆత్మకూరు మండల కేంద్రంనికి చేరుకుంది. జిల్లాలో 15 సంవత్సరాలుగా నీరు వస్తున్న రైతులకు సాగునిరు ఇవ్వడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం స్వార్ధ ప్రయోజనాలు,వ్యక్తిగత అభివఅద్ధి కోసం ప్రయాస పడుతున్నారు తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. పాలకులు ప్రభుత్వాలు మారిన జిల్లా ప్రజలు రైతుల కార్మికుల రాతలు మారడం లేదన్నారు.ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటలు పూర్తి అయ్యేవరకు హంద్రీనీవా, కాలవల ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనం అమలుచేసి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జిల్లాలో ఎస్‌.కె జేఎన్టీయూ సెంట్రల్‌ యూనివర్సిటీలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పాఠశాల విద్యార్థులపై ఒత్తిడి పెంచే అంతర్జాతీయ విద్యా విధానం పద్ధతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ సబ్‌ సెంటర్లు పిహెచ్సి లను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి గ్రామీణ వైయస్సార్‌ వైద్య కేంద్రాలలో రెగ్యులర్‌ డాక్టర్లను నియమించాలన్నారు మునిసిపల్‌ పట్టణాలలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులనుంటిలో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టి ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఫీజులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు నిధులు స్వయం ఉపాధికి రుణాలు సబ్సిడీలు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను కచ్చితంగా ఆ కేటగిరీల వారికే ఖర్చు చేయాలన్నారు. నవంబర్‌ 15న విజయవాడలో చేపట్టిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు కార్మికులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి నగర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌,శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి ఆత్మకూరు మండల కార్యదర్శి శివ శంకర్‌ మధ్యాహ్నంభోజనం జిల్లా సహాయ కార్యదర్శి జయమ్మ రైతు సంఘం మండల కార్యదర్శి రాము ఆవాజ్‌ మండల కార్యదర్శి వలి ఐద్వా మండల కార్యదర్శి రాజేశ్వరమ్మ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు