ప్రజాశక్తి-గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ క్షమాపణలు చెప్పాలంటూ జనసేన మహిళలు మహిళలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి మహిళ కమిషన్ కార్యాలయంకు ర్యాలీగా బయలుదేరారు. మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులను నెట్టుకుంటూ మహిళా నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో పోలీసుల మరోసారి మహిళలను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్యాలయం బయట మహిళా నేతలు బైఠాయించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.










