
చిలకలూరిపేట: మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. జాతీయ రహదారిపై టిడిపి నేతలు రాస్తారోకో చేపట్టారు. టిడిపి అధినేత చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్ ను అడ్డుకున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వేలాదిగా ప్రజలు తరలిరాగా.. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించారు. దీంతో చంద్రబాబును తరలిస్తున్న వాహన శ్రేణి అరగంట పాటు నిలిచిపోయింది. స్పందించిన చంద్రబాబు వెంటనే వాహనం దిగివచ్చి దారి ఇవ్వాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టువదలకుండా టిడిపి కార్యకర్తలు అక్కడే బైఠాయించడంతో కాన్వారు అక్కడే ఉండిపోయింది. కాసేపటి తర్వాత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కార్యకర్తలు శాంతించడంతో కాన్వారు అక్కడి నుంచి ముందుకు కదిలింది.