Jul 12,2023 12:27

మన్యం : నిన్న జరిగిన టిడిపి బస్‌ యాత్ర తుస్‌ యాత్ర అయింది అని ప్రజలు అనుకుంటున్నారు అని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. బుధవారం ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ... వ్యక్తిగత విమర్శలు అవినీతి ఆరోపణలు చేసినవాళ్లు ఆధారాలు చూపించాలని అన్నారు. అభివృద్ధి లేదు అన్నవారు నిన్న జరిగిన టిడిపి బస్‌ యాత్రలో బస్‌ తిరిగిన రోడ్లన్నీ తమ ప్రభుత్వం లో నూతనంగా వేసిన రోడ్లేనని.. ఇది అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధి పనులు, ఏజెన్సీ ప్రాంతాల్లో వేసిన అనేక రోడ్లను వచ్చి పరిశీలించాలని విమర్శలు చేసిన టిడిపి నాయకుల గ్రామాల్లో కూడా రోడ్లు వేశామని, పెండింగ్‌ ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు.