Dec 26,2022 18:35

మౌంటెయిన్స్‌ ఆఫ్‌ ఇండియా, బీచెస్‌ ఆఫ్‌ ఇండియా, కల్చర్‌ ట్రిప్‌ ఆఫ్‌ ఇండియా, డిసెర్ట్స్‌ ఇన్‌ ఇండియా.. ఇలా ఈ నాలుగు ఆప్షన్స్‌లో ఎక్కడికి టూర్‌కు వెళ్లాలన్నా.. విజయ్ దేవరకొండ పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత ఐదేళ్లుగా 'దేవరశాంటా' పేరుతో విజయ్ దేవరకొండ అభిమానులకు సర్‌ప్రైజ్‌ బహుమతులు ఇస్తున్నారు. ఈ ఏడాది కానుకగా 100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్‌కు పంపించబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. యాష్‌ ట్యాగ్‌ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్‌ పంపించబోతున్నారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు ఈ ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా అభినందిస్తూ విజరుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.