హను రాఘవపూడి హీరో ప్రభాస్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్టోరీని ప్రభాస్, శ్రీలీలకు వినిపించగా.. వారు గ్రీన్ సిగల్ ఇచ్చారట. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాతలు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారని అంటున్నారు.










