Jun 16,2023 21:36

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ :బిసిలకు రాజ్యాధికారం అందించడమే అజెండాగా ఐక్యంగా ముందుకు సాగుదామని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ బాలయ్య అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని అందించడమే బిఎస్‌పి ప్రధాన లక్ష్యమన్నారు. బహుజనులకు అండగా బిఎస్‌పి ఉంటుందన్న భరోసా ఇచ్చేలా కార్యకర్తలు పని చేయాలని కోరారు. సోమవారం మదనపల్లిలో నిర్వహించనున్న రాయలసీమ బహుజన రాజ్యాధికార సభ పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జులు కాసాని నాగరాజు, తిరుమలయ్య, కొత్తూరు లక్ష్మినారాయణ, అనంతపురం నియోజకవర్గం కన్వీనర్లు కంచె గోపాల్‌, హేమ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.