సియోల్ : దక్షిణ కొరియాలో గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పదుల సంఖ్యలో మృతి చెందారు. మృతుల సంఖ్య 33కి చేరిందని, 10 మంది గల్లంతయ్యారని ఆదివారం అధికారులు తెలిపారు. ఆగేయ నార్త్ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్, సెంట్రల్ చుంగ్‌చియాంగ్ ప్రావిన్స్‌లలో కనీసం 33 మంది చనిపోయారని సెంటల్ డిజాస్టర్, సేఫ్టీ కౌంటర్‌మెజర్ ప్రధాన కార్యాలయం వెల్లడించిన నివేదికను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 500 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రావిన్స్‌లకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర జియోంగ్‌జాంగ్ ప్రావిన్స్‌లో తప్పిపోయిన తొమ్మిదిమందితో సహా మొత్తం పదిమంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.
కాగా, వర్షాలు, వరదలు, ఇళ్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడడంతో దక్షిణకొరియా దేశవ్యాప్తంగా ప్రాణనష్టం సంభవించింది. సెంట్రల్ టౌన్ ఓసాంగ్ వరద నీటితో ఉన్న భూగర్భ సొరంగంలో వాహనాల్లో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలను ఒక రాత్రికి రాత్రే వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 13 నగరాలు, ప్రావిన్స్‌ల నుండి దాదాపు 7,886 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భారీ వర్షాల కారణంగా రోడ్లు వంటి ప్రజా సౌకర్యాలు వందలాది సంఖ్యలో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.