
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ బారు సిద్దు జొన్నలగడ్డ ఈరోజు తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ చిత్రం కానుంది. భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికి 'తెలుసు కదా' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి అర్చనరావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మరికొద్ది వారాల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.