Nov 19,2022 11:06

వాషింగ్టన్‌ : 2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై నిషేధం ఎత్తేయాలా.. వద్దా? అంటూ.. జనాభిప్రాయం అడిగారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో శుక్రవారం సాయంత్రం ఓ పోల్‌ నిర్వహించారు. మొత్తంగా 24 గంటల పాటు కొనసాగే ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికే 20 లక్షల మంది పాల్గొన్నారు. అందులో దాదాపు సగం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది.