Feb 23,2023 13:45

ప్రజాశక్తి అచ్చుతాపురం(అనకాపల్లి) : సిపిఎం సీనియర్‌ నాయకురాలు కర్రీ పార్వతమ్మ గురువారం తన ఇంటి వద్ద మతి చెందారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన కర్రీ పార్వతమ్మ భర్త నరసింగరావుతో పాటుగా కలిసి పార్టీలో పనిచేశారు. నర్సింగరావు సూచనలు సలహాలు మేరకు పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అనేక పోరాటాల్లో ఎదురు నిలిచి పోరాడారు. ప్రజా సమస్యలతో పాటు సారా ఉద్యమం, రైతు సమస్యలపై మహిళా సమస్యలపై ఎనలేని పోరాటాలు ఆమె సాగించారు. రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఈ ప్రాంత మహిళలను చైతన్యవంతం చేయడంలో ఆమె ఎనలేని పాత్ర పోషించారు. పార్టీలో గ్రామస్థాయి కార్యకర్తలతో నుంచి జాతీయస్థాయిలో పదవుల్లో ఉన్న బివి రాఘవులతో సైతం ఆమె పరిచయాలు కలిసి పనిచేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆమె పార్థివ దేహంపై సిపిఎం జెండాను ఉంచి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పార్టీ నాయకులు ఏ బాలకృష్ణ , ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి, ఏపీ జిల్లా రైతు సంఘ అధ్యక్షులు కర్రీ అప్పారావు కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె రామ సదాశివరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, పార్టీ నాయకులు వివి శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, బుద్ధ రంగారావు, తదితరులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.