Sep 27,2023 19:44

'పురుషుల ఆత్మన్యూనతా భావం ఎక్కువైన కారణంగా ఈ మధ్యకాలంలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అమెరికాలోని మార్వెల్‌ యూనివర్స్‌ చిత్రాలు ఈ తరహాలో వచ్చేవి. అదే పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప ది రైజ్‌' చిత్రాలను ఇప్పటివరకూ నేను చూడలేదు. ఇలాంటి సినిమాలు చూసి థ్రిల్‌ కాకుండా ప్రేక్షకులు ఏం పొందుతారో నాకు తెలియదు. మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' చూశా. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారు' అని బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి సీనియర్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నసీరుద్దీన్‌ షా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.