Jul 28,2023 14:43

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో 23 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 63,932 మంది యాత్రికులు దర్శించుకోగా 25,862 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చిందని వెల్లడించారు.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 30న తులసి మహత్యం ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.