Sep 29,2023 20:13

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ 'సలార్‌'. . శ్రుతీ హాసన్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజరు దత్‌ ప్రతినాయక పాత్ర పోషించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు సలార్‌ విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ఖరారు చేసింది. క్రిస్మస్‌ కానుకగా సలార్‌ను డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రిలీజ్‌ డేట్‌ తో కూడిన కొత్త పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కట్‌ బనియన్‌ లో ఉన్న ప్రభాస్‌ ఒంటిపై రక్తం, చేతిలో కత్తితో నిలుచున్నాడు. ఈ చిత్రానికి కేజిఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించారు.