Oct 05,2023 20:44

హీరో వెంకటేష్‌ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం ఇది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌ మెంట్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించగా, ఎస్‌.మణికందన్‌ డీవోపీగా పనిచేస్తున్నారు. గ్యారీ బిహెచ్‌ ఎడిటర్‌, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌, కిషోర్‌ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది.