ప్రజాశక్తి-విజయవాడ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి'బ్రో' సినిమాలో నటించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే, తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'బ్రో' విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేసి.. అమ్మవారి చిత్రపటం, లడ్డూలను అందించారు.










