
జమ్మలమడుగు (కడప) : వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో టిప్పర్ ప్రమాదంలో రైతు, రైతు కూలీ మరణించిన ఘటనపై సిఎం వైఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు ఫిట్స్ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. టిప్పర్ పల్టీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మఅతి చెందాడు. మఅతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సిఎం అధికారులను ఆదేశించారు.