హైదరాబాద్ : ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్‌తో పాటు పలువురు నాయకులు కలిశారు.ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటు పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 16న భువనగిరిలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభపై సమీక్షించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం జిల్లాల పర్యటనకు సంబంధించి సోమవారం ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.