ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జగనన్న శాశ్వత భూ హక్కు, రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిర్ధిష్ట గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో బుధవారం రీసర్వే ప్రక్రియ, నూతన కలెక్టరేట్లలో సిబ్బంది నియామకంతోపాటు పలు అంశాలపై రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్సు కమిషనరు సిద్ధార్థజైన్, అదనపు సిసిఎల్‌ఎ ఇంతియాజ్, స్వామిత్ర ప్రత్యేక కమిషనరు ఎ సిరి పాల్గొన్నారు.










