చెత్తపన్నుకై సిబ్బందిని ప్రజలపై పురికొల్పే వైసిపి చర్యలను ప్రతిఘటించండి : సిపిఎం నేత జగ్గు నాయుడు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : వైసిపి పాలక వర్గం చెత్తపై యూజర్ చార్జీల వసూళ్ళు కోసం సచివాలయ సిబ్బందిని స్వయం సహాయక బృందాల అర్పి లను ప్రజలపై పురికొల్పే చర్యలకు పాల్పడుతున్నది. ఈ చర్యలను సిపిఐ(ఎం) విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. శుక్రవారం సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గునాయుడు మాట్లాడుతూ ... ప్రజలు ఎక్కడిక్కడ వైసిపి బలవంతపు చర్యలను ఐక్యంగా ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సచివాలయ శానిటరీ సెక్రటరీలపై ఒత్తిడి పెంచి చెత్తపై యూజర్ చార్జీల వసూళ్ళకు బలవంతం చేశారని, ఈ ఒత్తిడిని తట్టుకోలేక జోన్-4లో ఒక శానిటరీ సెక్రటరీ కూడా గుండెపోటుతో మరణించారని తెలిపారు. చెత్తపై యూజర్ చార్జీలు వసూలు చేయవద్దంటూ సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఆందోళన కూడా చేశారని చెప్పారు. గత రెండు రోజుల నుండి ఎస్చీల ఆర్పిలను ప్రజలపైకి చెత్త యూజర్ చార్జీల వసూలు చేయాలని అధికారులు బలవంతం చేస్తున్నారని అన్నారు. రోజువారి టార్గెట్లను నిర్ణయించి వసూళ్ళు చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎసాచి గ్రూపుల్లో చెత్త చార్జీలు వసూళ్ళుపై తీర్మానం చేసి ప్రతినెలా ఎసెన్టి గ్రూపుల నుండి వసూలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. యూజర్ చార్జీలు చెల్లించకపోతే గ్రూపుల నుండి తొలగించండని ఆదేశాలిస్తున్నారని అన్నారు. ప్రతినెల వఅద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ల నుండి బలవంతంగా చెత్త యూజర్ చార్జీలు కోత విధిస్తున్నారని అన్నారు. చెత్త యూజర్ చార్జీలు చెల్లించకపోతే పెన్షన్లను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. అపార్ట్మెంట్లు, ఇండ్ల వద్దకు వెళ్ళి చెత్త యూజర్ చార్జీలు చెల్లించకపోతే నీటి కొళాయిలు తొలగిస్తామని బెదిరిస్తున్నారని, చెత్త తీసుకువెళ్ళమని హెచ్చరిస్తున్నారని అన్నారు. గతంలో చెత్త యూజర్ చార్జీలు నెలకి రూ.120లు, రూ.60లు వసూలు చేయాలనే కౌన్సిల్ తీర్మానాన్ని మార్చి ఆ తరువాత శ్లాబుల పద్ధతిని తీసుకొస్తూ మరో తీర్మానం చేశారని అన్నారు. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. క్లీన్ ఏపి కింద తీసుకొచ్చిన వాహనాలు కాంట్రాక్టర్ లాభాల కోసమే. వైసిపి కనుసన్నల్లో నడిచే కాంట్రాక్టరు... అతని లాభాల కోసం ప్రజలపై ఈ భారాలకు వైసిపి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. చాలా క్లాప్ వాహనాలు మూలనపడుతున్నాయన్నారు. జివిఎంసి అవినీతి బాగోతాలు రోజుకుఒకటి వెలుగు చూస్తున్నాయన్నారు. వాహనాలు, వాకీటాకీ కొనుగోళు ప్రధానమంత్రి, నేవెల్ డే, తదితర కార్యక్రమాల నిర్వహణల్లో అక్రమాలు జరిగాయన్నారు. రోడ్లు, భవనాల ప్లాన్లు, కోడి వ్యర్ధ పదార్థాల్లో అక్రమాలు అన్నింటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదన్నారు. వీటన్నింటిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పైడి రాజు, కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి.గంగరావు లు పాల్గొన్నారు.










