రైతుబజారు భవన నిర్మాణానికి నిధుల కోసం వినతి : ఏ.ఎం.సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి
మైలవరం (ఎన్టీఆర్) : మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు మైలవరం పట్టణంలో రైతుబజారు శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు మైలవరం ఏ.ఎం.సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మైలవరంలో ఎప్పటినుంచో రైతు బజారుకు శాశ్వత భవనం లేక రైతులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం పక్కాగా భవనాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నిధుల మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మైలవరం నియోజకవర్గ అభివఅద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్ఫూర్తిదాయక సేవలను అందిస్తున్నారని కొనియాడారు.










