Feb 14,2023 19:56

నటి రేణూ దేశాయ్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యపై పోస్ట్‌ పెట్టింది. 'అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. నాలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ధైర్యాన్నివ్వడం కోసం, వారిలో పాజిటివిటీ నింపేందుకు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎప్పుడూ బలంగా ఉండాలి. అలా ఉంటే ఎప్పటికైనా ఫలితం వస్తుంది. మీపై, మీ జీవితంపై ఆశను కోల్పోవద్దు. ఈ విశ్వం మనకోసం ఎన్నో అద్భుతాలను దాచి ఉంచింది. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలి' అని చెప్పింది. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. త్వరలోనే మాములు స్థితికి వచ్చి.. తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)