ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు షెడ్యూల్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చిలో జరగనున్న పరీక్షలకు సెప్టెంబరు 30వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఫైయిలైన, డ్రాపౌట్ అయిన జనరల్, వొకేషన్ కోర్సుల విద్యార్థులు చెల్లించాలని తెలిపారు. ప్రథమ, లేదా ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషషన్ కోర్సుల విద్యార్థులు థియరీ పేపర్లకు రూ.550, ప్రాక్టికల్ పరీక్షలకు రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.150 చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండు సబ్జెక్టులకు హాజరయ్యే విద్యార్థులు రూ.1100, ప్రాక్టికల్ పరీక్షలకు రూ.500, పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఒకటి నుంచి విద్యార్థులు జ్ఞానభూమి పొర్టల్ ద్వారా చెల్లించాలి.