అజిత్ హీరోగా 'విడాముయర్చి' చిత్రంలో రెజినా నటిస్తున్నాట్లు సమాచారం. అజిత్ కెరియర్‌లో 62వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి ముందుగా విగేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరో డైరెక్టర్ ఆ సినిమాను తెరకేక్కించనున్నారు. మొదట్లో ఈ సినిమాలో త్రిష, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్‌గా అర్జున్ దాస్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో అర్జున్ దాస్ చిత్రం నుంచి వైదొలగారు. ఇప్పుడు ఆ పాత్రను ఆరవ్ పోషిస్తున్నారు. ఇక చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో హ్యుమా ఖురేషీ కూడా చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆమెకు బదులుగానే రెజీనాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత ఈ చిత్ర షూటింగ్ ఇటీవలె అజర్‌బైజాన్ దేశంలో ప్రారంభమైంది. ఆ తర్వాత షెడ్యూల్ దుబారులో జరగనుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.










