Mar 23,2023 21:14

న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ అధిక ఆదాయం కలిగిన వారి కోసం తన రెగాలియా శ్రేణీ క్రెడిట్‌ కార్డ్‌లను ఆవిష్కరించినట్లు తెలిపింది. అసమానమైన ఫీచరు, ప్రయోజనాలతో కూడిన సూపర్‌ ప్రీమియం రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది. ప్రయాణం, లైఫ్‌స్టైల్‌ ప్రయోజనాలు కలిగిన ఈ కార్డ్‌ ద్వారా ప్రీమియం బ్రాండ్‌ల సేకరణను అనుమతిస్తుందని పేర్కొంది. అయితే ఇది అధిక ఆదాయం కలిగిన వ్యక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. వార్షిక ఖర్చుల ఆధారంగా ఏడాదికి రెండు విమానయాన టికెట్లను పొందే వీలుందని పేర్కొంది.