Sep 23,2023 15:27

రష్మిక ఒక వైపున తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తూనే హిందీలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హిందీలో ఆమె చేసిన 'యానిమల్‌' డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రష్మిక లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రణబీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ఈ సినిమాకి సందీప్‌ వంగా దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.