Oct 18,2023 16:48

పెళ్ళిచూపులు, 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రాల ఫేమ్‌ దర్శకుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత తరుణ్‌ భాస్కర్‌ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'. క్క్రెమ్‌ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజరు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీసాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు రానా దగ్గుబాటి.

ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. తాము అనుకున్న కథని బలంగా నమ్మి, కథకు కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్‌ మేకర్స్‌ చాలా అరుదుగా వుంటారు. తరుణ్‌ భాస్కర్‌ కూడా లాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్‌ సినిమాలు చేసే తరుణ్‌ భాస్కర్‌ లాంటి ఫిల్మ్‌ మేకర్‌ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్‌ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకుల కూడా ఎంజారు చేస్తారనే నమ్మకం వుంది. తరుణ్‌ సినిమాల్లో ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తున్నాం. నవంబర్‌ 3న సినిమా వస్తోంది. సినిమా చూడండి. తప్పకుండా ఎంజారు చేస్తారు''అన్నారు.

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. క్రైమ్‌ కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్‌. ఈ జోనర్‌ లో సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. అయితే మొదటి సినిమా ఫ్యామిలీతో వెళ్ళడానికి, అలాగే బడ్జెట్‌ పరంగా వీలుగా ఉంటుందని పెళ్లి చూపులు, తర్వాత ఈ నగరానికి ఏమైయింది చిత్రాలు చేయడం జరిగింది. కీడా కోలా కథ రాస్తున్నపుడు ఈ జోనర్‌ ఎంత కష్టమైనదో అర్ధమైయింది. కథ అద్భుతంగా వచ్చింది. చిత్రీకరణ కూడా చాలా ఎంజారు చేస్తూ చేశాం. ఇందులో చాలా కొత్తదనం వుంటుంది. సినిమా అంతా వినూత్నంగా వుంటుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైయింది చిత్రాల విషయంలో కొంచెం నెర్వస్‌ నెస్‌ వుండేది. కానీ ఈ చిత్రం విషయంలో చాలా కాన్ఫిడెంట్‌ గా వున్నాను. ఎడిట్‌ పదిసార్లు చూశాను. చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఫ్యామిలీ,స్నేహితులతో కలసి వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. రానా గారు బావుందని స్టాప్‌ వేస్తే చాలా మంచి వైబ్‌ వస్తుంది. చిత్ర నిర్మాతలు నా స్నేహితులే. డబ్బులు పెట్టండి.. వస్తాయని నమ్మకంగా చెప్పాను( నవ్వుతూ). ఇందులో పాత్రలన్నీ వియర్డ్‌ గా వుంటాయి అందులోనే ఫన్‌ వుంటుంది. తప్పకుండా అందరూ ఎంజారు చేస్తారు'' అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య రావు మదాడి, రాగ్‌ మయూర్‌, విష్ణు, జీవన్‌ కుమార్‌, రవీంద్ర విజరు, రఘు రామ్‌, మిగతా యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.