రజినీకాంత్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా భాగం కానున్నట్లు గతంలోనే ప్రకటించారు. 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్‌తో లైకా ప్రొడక్షన్స్ నుంచి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన తాజా అప్టేడ్ ప్రకారం రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్-రజినీకాంత్‌కి విలన్‌గా రానా నటిస్తున్నాడనే టాక్ కోలీవుడ్ ఇండిస్టీలో ఉంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. చెన్నైలో వేసిన భారీ సెట్‌లో ఈ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ఎంకౌంటర్‌లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.










