భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి : మైలవరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్
మైలవరం (ఎన్‌టిఆర్) : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ... శుక్రవారం ఉదయం నిర్మాణ కార్మికుల పని ప్రదేశాలలో కరపత్రం రిలీజ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మైలవరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నలబోతుల దుర్గారావు మాట్లాడుతూ ... మూడు సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులకు ఒక్క క్రైమ్ కూడా అవటం లేదని తిరువూరు లేబర్ ఆఫీసు మూసివేసి ఉందని కనీసం లేబర్ గా గుర్తింపు కార్డులు తెచ్చుకోవడానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిఒ నెంబర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.










