Dec 22,2022 15:32

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం (ఏలూరు) : భీమవరంలో జరిగే సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యలయంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 2 3 4 తేదీల్లో సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు భీమవరంలో జరగబోతున్నాయన్నారు రెండో తేదీన భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుందని ఈ సభకు మండలంలోని స్కీం వర్కర్లు, బిల్డింగ్‌, ఆటో కార్మికులు, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు మండల కార్యదర్శి పోడియం రాజు, జేయరాజు, మణికల, మంగరాజు, అల్లూరి మోహన్‌, కృష్ణారెడ్డి, రాంచందర్రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.