
మాడ్రిడ్ : స్పెయిన్ అధ్యక్ష పదవికి, పార్లమెంటు దిగువ సభలోని 350 స్థానాలకు, 208 సెనెటర్ల స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకు 53.12 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2019 నాటి ఎన్నికలతో పోల్చితే 3.76 శాతం తగ్గింది. పోలింగ్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. స్పెయిన్‌లో ప్రతి నాలుగేళ్లకొకసారి పార్లమెంటు, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని కన్సర్వేటివ్ కూటమికి, సోషలిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రగతిశీల కూటమికి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఇరు పక్షాలు హౌరాహౌరీగా సభలు నిర్వహించాయి. పీపుల్స్ పార్టీకి పచ్చి మితవాద వోక్స్ పార్టీతో జత కట్టగా, పోడెమస్ పార్టీ లెఫ్ట్ వింగ్ సమర్‌తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఫలితాలు సోమవారం వెలువడే అవకాశముంది.