
భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్వదేశంలో, విదేశాల్లో ఎంతో కోలా హలంగా జరిగాయి. వాస్తవానికి ఈ సందర్భాన్ని సమీక్షించుకొని భారత ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసే మంచి సందర్భం ఇది. గడచిన డెబ్భై ఐదేళ్ళ కాలంలో భారతదేశం చాలా సాధించింది. కానీ సమానత్వం, మానవతా ధర్మం, స్వేచ్ఛ, అందరినీ కలుపుకొని పోయే విధానం, ఆర్థిక పునాదికి దిగువనున్న అనేక మందికి సమాన అవకాశాలను సష్టించాలన్న స్వాతంత్య్ర సారాన్ని అందించేందుకు మరింత గా కృషి చేయాల్సిన అవసరముంది.
ప్రధానమంత్రి ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో, దృష్టి సారించాల్సిన అంశాలకు సంబంధించి ఐదు ప్రతిజ్ఞలను సూచించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృ ద్ధి చెందిన దేశంగా మార్చడం. వలసరాజ్య ఆనవాళ్ళన్నిటినీ పూర్తిగా తొలగించడం. మన మూలాలు, వారసత్వాలను సగర్వంగా భావించడం. ఐక్యత, సమగ్రతలను సాధించడం. పౌరులలో కర్తవ్య భావనను కలిగించడం.
మరింత స్పష్టత అవసరం
ఈ ఐదు ప్రతిజ్ఞలపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, సంస్థాగతం చేసి అమలు చేయడానికి విశాల ప్రాతిపదికన జాతీయంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది.
మొదటగా, ఏ రకమైన దేశంగా అభివృద్ధి చెందాలని మనం అనుకుంటున్నాం? కొన్ని పాశ్చాత్య దేశాలలో మాదిరిగా కొద్దిమంది అత్యంత ధనికులు వున్న... తీవ్ర అసమానతలు, వెలివేతలు, పేదరికం, ఆకలి, అన్యాయం, హింస, అశాంతితో కూడిన అధిక జీడీపీ వున్న దేశాన్ని కోరుకుందామా? లేదా సంపద పంపిణీ, శాంతి యుతమైన, అభివృద్ధి చెందుతున్న, అందరినీ కలుపుకొనిపోయే విధానంతో, సంతోషంగా అందరికీ సమానావకాశాలు కల్పించే దేశాన్ని కోరుకుందామా? ఎంపిక చేయబడిన కొందరి కోసమే అభివృద్ధి చెందిన దేశాన్ని కోరు కుందామా? లేక అందరి కోసం అభివృద్ధి చెందిన దేశాన్ని కోరుకుందామా? అందుకుగాను రాజ్యాం గం, ప్రజాస్వామ్యం, భిన్నత్వం, స్వేచ్ఛ, సమానత్వం, మానవతా ధర్మం, న్యాయం లాంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముందుగా మనకు స్వచ్ఛమైన గాలి, తాగునీరు, తగినంత శక్తి కావాలి గదా? దీనికి స్వతంత్రమైన, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, పౌర సమాజం, వికేంద్రీకృతమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆలోచనా ధోరణికి సంబంధించిన చిక్కులు, వాటికి సంబంధించిన అవగాహన అవసరం.
రెండోది, మనం బలహీనులతో సరైన రీతిలో మెలుగుతూ పాకీ పనిని, బాల కార్మిక వ్యవస్థను, కుల వ్యవస్థను, మన సమాజంలోని పురుషాధిక్యతను, కులాధిపత్యాన్ని రద్దు చేసినపుడు మాత్రమే వలసరాజ్య ఆనవాళ్ళను పూర్తిగా తొలగించడం సాధ్యమవుతుంది. మూడోది, మనం మన మూలాలు, వారసత్వాల గురించి గర్వించే క్రమంలో ప్రతీ ఒక్కరి భవిష్యత్తు అవకాశాల కోసం గతంలో మనం చూపిన దురభిమానాలను, వాటి ప్రాధాన్యతలను విడిచి పెట్టాలి. నాలుగోది శాంతి, ప్రగతి కోసం ఐక్యత, సమగ్రతల అవసరం ఉంటుంది. అయినా అవి మతం, జాతి, కులం, ఆచారం, భాష, సామాజిక హోదా లాంటి అంశాలకు సంబంధించిన లోతైన అవగాహన, సహనాలను డిమాండ్ చేస్తాయి. చివరగా...ఇతరులకు సేవ చేసి, సహాయ పడడానికి, పౌరులలో కర్తవ్య భావనకు... క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, విలువలు, నైతికత, నిస్వార్థ త్యాగం లాంటి అంశాల అవసరం ఉంటుంది.
నేటి విషపూరిత, ఉద్రిక్త వాతావరణంలో... విభజన రాజకీయాలకు పాల్పడడం, పాలనా యంత్రాంగంలో పెద్దలు జోక్యం చేసుకోవడం, నిజాయితీ లేని చర్చలు చేయడం, మీడియాను అదుపు చేయడం చెప్పు చేతల్లో పెట్టుకోవడం, హిందూత్వకు అధిక ప్రాధాన్యతనివ్వడం, ముస్లిం లు, మైనారిటీలను అట్టడుగుకు నెట్టివేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో నగరాల పేర్లు మార్చడం, చరిత్రను తిరగ రాయడం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ప్రధానమంత్రి చేసిన ప్రతిజ్ఞను అమలు చేయడం కష్టమైన పని. దానితో పాటు గా అధికారం, లాభాలకే విలువనిచ్చే ధోరణి ప్రస్తుత ప్రపంచ నాయకుల్లో కనిపిస్తున్నది. కాబట్టి ప్రజలకు, భూ గ్రహానికి సంబంధించిన సమస్యలపై నాయకుని దృష్టి మళ్లేలా చేయడం కష్టమైన పని. నేడు ఈ భూ గ్రహానికి, ప్రజలకు ఏది మంచి అనేది ప్రపంచ నాయకుల ఎజెండాలో ఉండదు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ప్రధానమంత్రి ఎజెండాలోని ప్రతిజ్ఞలను సాధించడానికి మనం ఏ విధమైన ప్రతిన పూనాల్సిన అవసరముంది?
భావి భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే ఈ ఐదు ప్రతిజ్ఞలను చర్చిం చాలని నేను సూచిస్తున్నాను. నేను ప్రతి మనిషిని వారి మతం, జాతి, కులం, వర్ణం, ఆచారం, భాష, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా గౌరవంగా, ప్రేమగా చూస్తాను. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పత్రాన్ని అధ్యయనం చేసి అనుసరిస్తూ, తోటి మనుషుల జీవితాలు సురక్షితంగా, భద్రంగా, మెరుగ్గా ఉండేందుకు సహాయ సహకారాలను అందజేస్తాను.
స్వతంత్ర స్వయంప్రతిపత్తిగల సంస్థలు, చైతన్యవంతమైన పౌర సమాజం, హేతుబద్ధ మైన ఆలోచనా ధోరణి, అందుబాటులో ఉన్న న్యాయ వ్యవస్థ ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోయే విధానం, సమానత్వం, న్యాయాలను కాపాడడా నికి భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు కష్ట పడతాను.
అసత్యాలను కాక సత్యాన్ని, అపనమ్మకాన్ని కాక నమ్మకాన్ని, ద్వేష భావాన్ని కాక ప్రేమను ఆచరించడం ద్వారా మంచి పౌరునిగా ఉంటాను. అవినీతికి పాల్పడకుండా, పన్నులను ఎగ్గొట్టకుండా, నేరాలు, హింస, డ్రగ్ మాఫియా, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు, వ్యక్తిగత దాడులు, కక్షపూరిత చర్యలు, తప్పుడు సమాచారాలకు పాల్పడకుండా నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాను. నేను కక్షపూరిత చర్యల్లో పాల్గొనకుండా, కోపాన్ని నిగ్రహిం చుకునే విధానాన్ని, ఎదుటివారిని క్షమించే గుణాన్ని, రాజీపడే తత్వాన్ని అలవర్చుకుంటాను. మహిళలను, ఆడపిల్లలను, యువతులను గౌరవించి, వారి ప్రయోజనాలను కాపాడతాను.
ప్రజాసేవ
మా నివాస ప్రాంత పరిశుభ్రతకు, ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చేందుకు, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి, వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు, వారిలో నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకు, చిన్నారులు ఆడేందుకు, స్థానికంగా చెట్లు నాటేందుకు, న్యాయ సేవలు అందించేందుకు, స్థానిక గ్రంథాలయాన్ని నడిపేందుకుగాను అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నేను ప్రతి వారం ఎటువంటి ప్రతి ఫలాన్ని ఆశించకుండా కొన్ని గంటల సమయాన్ని వెచ్చిస్తాను. బయటి వారి సహకారం లేకుండానే ఇతరులకు సహాయం చేయడానికి నా స్వంత మార్గాలను అన్వేషిస్తాను.
గాంధీజీ అహింసా మార్గాలను ఆచరించి, ఇంట్లో, కుటుంబాల్లో, పాఠశాలల్లో, వీధుల్లో, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో, గ్రామంలో, నగరంలో ప్రోత్సహిస్తాను. ఈ క్రమంలో తోటి మానవులను గాయపరిచే విధం గా పదజాలాన్ని ఉపయోగించి, ఆగ్రహాన్ని వ్యక్తం చేయను. కల్పనలు కాక వాస్తవాలు, పిడివాదం కాక ఆధారంతో కూడిన వివరాలకు విలువనిచ్చే హేతుబద్ధమైన, సహేతుకమైన, శాస్త్రీయ ఆలో చనలను నేను అభివృద్ధి చేసుకుంటాను. వాదన లు, కోపతాపాలు, అవమానాలు, ద్వేష భావం లేకుండా ఇతరుల భిన్నాభిప్రాయాలను, అభిప్రా యాలను గౌరవిస్తూ అర్థవంతమైన చర్చలకు తావిచ్చే ఆలోచనా ధోరణిని కలిగి ఉంటాను.
ప్రజా ఉద్యమం అవసరం
ఈ ప్రతిజ్ఞలు చేయడం, వాటిని అనుసరిం చడం చాలా పెద్ద పని. దేశంలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వంలో, వ్యాపారంలో, పౌర సమాజంలో, రక్షణ-సేవా రంగంలో, న్యాయ వ్యవస్థలో, మీడియాలో, శాస్త్ర సాంకేతిక రంగంలో, విద్య, ఆరోగ్యం, కార్మిక రంగంలో, కళారంగంలో ఈ ప్రతిజ్ఞలను విశ్వసించి, ఆచరించి, ప్రోత్సహిస్తున్న మైనారిటీలలో, యువకుల్లో, మహిళల్లో తగినంత భాగస్వామ్యం లేకుండా మనందరం గర్వపడే విధంగా అందరినీ కలుపుకొనిపోయే దేశాన్ని నిర్మించడం సవాల్‌గా మారుతుంది.
భారతదేశ చరిత్ర, వారసత్వం, నాగరికత పట్ల, భారతీయ ప్రజానీకం విజ్ఞత పట్ల నాకు అపారమైన విశ్వాసం వుంది. విభిన్న ప్రజా సమూహాల సాహసికత, నిబద్ధత, దఢ విశ్వాసంతో సమైక్యం చేయగలుగుతారని భావిస్తున్నాను. ఆ విధంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమ్మిళితాభివద్ధినీ పెంపొందించగలరనీ దేశీయులందరి పురోగమనం కోసం కషి చేయగలరనీ విశ్వసిస్తున్నాను.
నేను ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. నాతో పాటుగా మీరూ ప్రతినబూనతారా?
రచయిత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సాంకేతిక సలహాదారు శామ్ పిట్రోడా