తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 22 కంపార్ట్‌మెంట్‌లో యాత్రికులు వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామిని 78,115 మంది యాత్రికులు దర్శించుకోగా 38,243 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చిందని వివరించారు.










