తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 69,378 మంది యాత్రికులు దర్శించుకోగా 28,371 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.76 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం ఆలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.










