విజయవాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన ' దేశ రక్షణ భేరి ' బహిరంగ సభ శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడ జింఖానా మైదానంలో ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సిపిఎం నేతలు, కార్యకర్తలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు.



























