నబ్లూస్ : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయిల్ సైన్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల పాలస్తీనీయుడు మరణించాడు. మరో ముగ్గురు పాలస్తీనీయులు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్‌బ్యాంక్‌లోని నబ్లూస్ నగరంలో ఒక ప్రార్థనా స్థలానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడ్ని బద్రా అల్ మస్రీగా గుర్తించారు. కొన్ని దశాబ్ధాల నుంచి వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సైన్యం దాడులకు పాల్పడుతున్నా.. కొన్ని నెలలు నుంచి ఇది తీవ్రంగా మారింది. ఈ ఏడాదిలోనే 150 మందికిపై పాలస్తీనా పౌరులు ఇజ్రాయిల్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 1967లో వెస్ట్‌బ్యాంక్‌ను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది.










