Aug 22,2023 21:23
  • తొలి వన్డేలో 142పరుగుల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు

హంబన్‌తోట(శ్రీలంక): పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన ఆఫ్ఘన్‌ జట్టును తొలి వన్డేలో పాకిస్తాన్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్‌ నిర్దేశించిన 202పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆఫ్ఘన్‌ను రవూఫ్‌(5/18) నిప్పులు చెరిగే బంతులకు 59పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్‌ జట్టు 142పరుగుల భారీ తేడాతో తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టు 47.1ఓవర్లలో 201పరుగులకే కుప్పకూలింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌(61), షాదాబ్‌(39), ఇఫ్తికార్‌(30) టాప్‌ స్కోరర్స్‌. ముజీబ్‌కు మూడు, నబి, రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆఫ్ఘన జట్టు 4పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రమంలో వికెట్లను కోల్పోతూ 19.2 ఓవర్లలో ఆలౌటైంది. గుర్బాజ్‌(18), అజ్మతుల్లా(16) రెండంకెల స్కోర్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రవూఫ్‌కు లభించగా.. రెండో వన్డే గురువారం జరగనుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్‌ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది.