Apr 16,2023 12:59

ప్రజాశక్తి-చందర్లపాడు(ఎన్‌టిఆర్‌) : బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చందర్లపాడులో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ.. బిజెపి విధానాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సంద్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చనుమొలు సైదులు మాట్లాడుతూ.. బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ విధానాలను తిప్పి కొట్టాలని, రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి విధానాలను బలపరుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలైన రాజధాని నిర్మాణం విశాఖ రైల్వే జోన్‌ కడప ఉక్కు ఫ్యాక్టరీ వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో , సిపిఎం నాయకులు షేక్‌ హుస్సేన్‌, సందిపోగు లింగయ్య, షేక్‌ ఉద్దండు, తోట రామారావు తదితరులు పాల్గొన్నారు.