గాజా: హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అన్నపానీయాలు, ఔషధాలు ఇతరత్రా మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు శనివారం ఈజిప్టు- గాజా సరిహద్దులోని రఫా సరిహద్దు పాయింట్‌ను తెరిచారు. దీంతో ఐరాస సంస్థలు సేకరించిన సామగ్రితో కూడిన వాహనాలు ఈజిప్టు వైపు నుంచి గాజాలోకి ప్రవేశించాయి. ఆ సామగ్రిని చిన్న చిన్న వాహనాల్లోకి ఎక్కించి గాజాలోని ఆయా ప్రాంతాలకు చేరవేయనున్నట్లు సమాచారం.