పూర్ణామార్కెట్ (విశాఖ) : భవనం కుప్పకూలడంతో ఒకరికి గాయాలైన ఘటన బుధవారం ఉదయం విశాఖ పూర్ణామార్కెట్ కూడలి సమీపంలో చోటుచేసుకుంది. పూర్ణా మార్కెట్ కూడలి సమీపంలో కొండపైనున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో కేజీహెచ్ కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










