
జైపూర్ : రాజస్థాన్‌లోని పలు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులకు మద్దతుగా పెద్దఎత్తున ప్రజానీకం ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. అనుప్ గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి శోభా సింగ్ దిల్లోన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సిపిఎం నాయకులు విక్రమ్ సింగ్, శ్యోపత్ రామ్, గూర్చరణ్ సింగ్ మోడ్ తదితరులు ప్రసంగించారు. సర్దర్శహర్ నుండి సిపిఎం అభ్యర్థిగా చాగన్ లాల్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.