Sep 09,2023 21:36

ప్రజాశక్తి - కొవ్వూరు :చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, కుట్రలు లేవు. సిఐడి అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్‌ చేసింది. నంద్యాల నుంచి విజయవాడకు హెలికాఫ్టర్‌లో తరలిస్తామని సిఐడి అధికారులు చెప్పినా చంద్రబాబు మాట వినలేదు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరికీ అర్థం అవుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలో జరిగిన స్కామ్‌ను గత ప్రభుత్వ పాలనలోనే గుర్తించారు. గతంలో జగన్‌ను రాజకీయ కుట్రతో అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు కేవలం ఆయన చేసిన తప్పిదాల వల్లే జరిగింది. అరెస్టును బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి. ఆమె ఖండన ద్వారా అమిత్‌ షాపై రాళ్లు వేయించిన, మోడీని తిట్టించిన వారిని సమర్థిస్తున్నట్టు ఉంది. ఇన్నాళ్లు మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ముందుకురావడం ద్వారా ఈ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ ఎంతో ప్రకటించాలి' అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.