
నూజివీడులో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఇంటర్మీ డియట్ విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్య 350 వరకు ఉంటుంది. వీరందరూ పేద విద్యార్థులు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో సుమారు 1000 నుండి 1500 మంది విద్యార్థులు ఉంటారు. ఒకప్పుడు నూజివీడులో విద్యను అభ్యసించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కారణం ఏంటంటే అప్పట్లో ధర్మ అప్పారావు కళాశాల రాష్ట్రం మొత్తం పేరుగాంచింది. ఈ కళాశాల అప్పట్లో ఎయిడెడ్‌గా కొనసాగేది. ఇప్పుడు ఈ ధర్మ అప్పారావు కళాశాల ప్రైవేట్ పరమైంది. ఇంతవరకు గవర్న మెంట్ డిగ్రీ కాలేజీ ఊసే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లోకి రాకముందు నియోజవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అధికారానికి వచ్చి నాలుగేళ్లైనా కనీసం శంకుస్థాపన రాయి కూడా పడలేదు. దాంతో పేద పిల్లలకు విద్య దూరమవు తోంది. తక్షణమే నూజివీడు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి.
- కె. లెనిన్, సెల్ : 8885900618