నితిన్, శ్రీలీల జంటగా, వక్కంతం వంశి దర్శకత్వంలో వస్తున్న 'ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్' సినిమా కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం, డిసెంబర్ 22న విడుదల కావాల్సి వుంది. అయితే అదే తేదీకి ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా వస్తుండటంతో నితిన్ సినిమా విడుదల తేదీ మారింది. డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని చిత్రబృందం విడుదలచేసింది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు.










