గుంతకల్లు (అనంతపురం) : ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ... మున్సిపల్ కార్యాలయం వద్ద గుంతకల్లు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ... వైసిపి పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ముసుగులో రాష్ట్ర ప్రజలపై నవ భారాలు మోపారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలపై చెత్త, ఆస్తి పన్నులు, ఆర్టీసీ, విద్యుత్తు వంటి చార్జీల నవ భారాలు మోపారని విమర్శించారు. పన్నుల భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, కసాపురం రమేష్, సాకే నాగరాజు, వైటిసి రమేష్, జగ్గలి రమేష్, తదితరులు పాల్గొన్నారు.










