Sep 23,2023 19:47

షారూక్‌ఖాన్‌ హీరోగా నటించిన 'జవాన్‌'లో నయనతార నర్మద పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రపై షారూక్‌ ఆసక్తికర కామెంట్‌ చేశారు. తాజాగా ఆయన 'షారూక్‌ఖాన్‌తో మాట్లాడండి (ఆస్క్‌ ఎస్‌ఆర్‌కె)' అనే పేరుతో ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'జవాన్‌'లో నయనతార చేసిన నర్మద పాత్రను ప్రస్తావించారు. ఆ పాత్ర సన్నివేశాలు సినిమాలో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ ట్వీట్‌కు షారుక్‌ సమాధానం ఇస్తూ 'నర్మద పాత్ర చాలా గొప్పగా ఉంది. దురదృష్టవశాత్తూ సినిమాలో ఆ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ, కనిపించిన కొంతసేపు అద్భుతంగా ఉంది' అని పేర్కొన్నారు. ఇక 'జవాన్‌'లో షారూక్‌ తన డైలాగుల గురించి చెబుతూ..దర్శకులు చెప్పినట్లు తాను చేస్తానని అన్నారు. వాటి కోసం సాధ్యమైనంత ఎక్కువ సమయం తీసుకుని ప్రాక్టీస్‌ చేశాననిఅన్నారు.