'1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా, జాతీయ రహదారి' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా మరో ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా చేయబోతున్నారు. 'ప్రభుత్వ సారాయి దుకాణం' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. 'షేక్‌స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా.. పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ఈ సినిమా కథను తయారు చేసుకున్నాను' అని నరసింహ చెప్పారు. అదితి మైఖేల్, వినరు, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు నటిస్తున్నారు.